బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్..!

Monday, August 3rd, 2020, 05:18:34 PM IST

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ కూర్పుకు సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని, తాను చెప్పిన ఏ ఒక్కరి పేర్లు కూడా కమిటీలో లేవని ఎమ్మెల్యే రాజాసింగ్ నేరుగా బండి సంజయ్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. గ్రూప్ రాజకీయాలు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచనలు ఇచ్చారు. ఇకపోతే 23 మందితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమీటీనీ ఏర్పాటు చేశారు. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించారు.