గోరక్షణ కోసం సొంత పార్టీనైనా తొక్కేస్తా – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Monday, December 21st, 2020, 10:38:29 PM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ యుగతులసి పౌండేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో జరిగిన గోమహాధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ గోరక్షణలో తమకు అడ్డు వస్తే సొంత పార్టీనైనా తొక్కేస్తానని అన్నారు. గోరక్షణ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదని అన్నారు.

అయితే ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కష్టమని పార్టీ పెద్దలు బతిమిలాడారని అన్నారు. గోమాత తన తల్లని గోరక్షణ తన ధర్మమని తన కర్తవ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క హిందువు ఆవును కాపాడుకోవాలని అన్నారు. హిందూ ధర్మం, గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని, పార్టీనైనా పదవినైనా గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తానంటూ ఉద్వేగానికి గురయ్యారని అన్నారు. అయితే పదవులు తనకు లెక్క కాదని, ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.