సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..!

Wednesday, October 28th, 2020, 07:00:06 PM IST

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం, దామగుండం అటవీ ప్రాంతంలో ఈ నెల 24న ఓ ఆవును తుపాకితో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫామ్ హౌజ్ ఇంఛార్జ్ ఉమర్ ఈ పని చేసినట్టు గుర్తించి అతడని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా కూడా ఉందని అన్నారు. సానియానే కాల్పులు జరిపిందని గ్రామస్థులు చెబుతున్నారని పేర్కొన్నారు. గోమాతపై కాల్పులు జరిపిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.