బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు.. కారణం అదే..!

Saturday, August 29th, 2020, 11:00:16 AM IST

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు భద్రత పెంచారు. ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీసీపీ స్థాయి అధికారితో రాజాసింగ్ భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేను బైక్‌పై తిరగవద్దని, ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కార్‌లోనే ప్రయాణించాలని పోలీసులు ఆయనకు సూచించారు.

ఇదిలా ఉంటే సేవా దృక్పదం, దూకుడు స్వభావం ఉన్న రాజాసింగ్ గోషామహల్ నుంచి వరుసగా 2014, 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తెలంగాణలో జరిగిన 2018 ముందస్తు ఎన్నికలలో బీజేపీ తరుపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, శాసనసభ పక్షనేతగా కొనసాగుతున్నాడు. ఇటీవల ‘ఫేమ్ ఇండియా ఆసియా” వారు నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోనే అత్యుత్తమ 50 మంది ఎమ్మెల్యేలలో రాజాసింగ్ రెండవ స్థానంలో నిలిచాడు.