దేశంలో అత్యుత్తమ ఎమ్మెల్యేలలో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన రాజాసింగ్..!

Friday, August 14th, 2020, 01:05:17 PM IST

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దేశంలోనే అత్యుత్తమ ఎమ్మెల్యేల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సేవా దృక్పదం, దూకుడు స్వభావం ఉన్న రాజాసింగ్ “ఫేమ్ ఇండియా ఆసియా” వారు నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యుత్తమ 50 మంది ఎమ్మెల్యేలలో రెండవ స్థానంలో నిలిచాడు.

రాజాసింగ్ గోషామహల్ నుంచి వరుసగా 2014, 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికలలో బీజేపీ తరుపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, శాసనసభ పక్షనేతగా ఉన్న రాజాసింగ్ ఫేమ్ ఇండియా ఆసియా సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ఎమ్మెల్యేలలో రెండో స్థానంలో నిలవడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది.