దుబ్బాక అభివృద్ధి రఘునందన్‌తోనే సాధ్యం.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..!

Saturday, October 31st, 2020, 05:02:07 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరుకోవడంతో అన్నీ పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దుబ్బాకలో ఒక యుద్ధం జరుగుతుందని మంత్రి హరీశ్ రావు మాటలు విని దుబ్బాక ప్రజలు మరోసారి మోసపోకండని అన్నారు.

అంతేకాదు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తున్నామని చెబుతున్నారని, దుబ్బాకలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించారో మంత్రి హరీష్‌ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు. అయితే దుబ్బాక ప్రజలకు న్యాయం జరగాలంటే రఘునందన్‌ను అసెంబ్లీకి పంపించాలని, దుబ్బాక అభివృద్ధి రఘునందన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.