కాళీమాత భూముల కబ్జా వెనుక డీసీపీ ప్రమేయం ఉంది – ఎమ్మెల్యే రాజాసింగ్

Thursday, December 17th, 2020, 01:00:08 AM IST

కాళీమాత దేవాలయం భూముల వివాదంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ భూముల కబ్జా వెనుక డీసీపీ ప్రమేయం ఉందని అన్నారు. హైకోర్టు ఆర్డర్‌ను కాదని డీసీపీ కింది కోర్ట్ ఆర్డర్‌ను అమలు చేయటానికి ప్రయత్నించారని మండిపడ్డారు. పాతబస్తీలో మత కలహాలు సృష్టించి దానిని బీజేపీకి అంటించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్‌పై ఎంఐఎం గూండాలు దాడికి ప్రయత్నించారని అన్నారు. వాలయం భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎండోమెంట్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆలయభూములు కబ్జా చేశారని అన్నాడు.

అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్‌లోని పాతబస్తీలో కాళీమాత దేవాలయం భూములపై వివాదం తీవ్ర వివాదం నెలకొంది. సర్వేనెంబర్‌ 24, 25, 26లో ఏడు ఎకరాల 13 గుంటల భూమి 1951 నుంచి దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. అయితే ఆ భూమిని ఆలయట్రస్ట్‌ తనకు అమ్మారని నకిలీ పత్రాలతో కబ్జా చేసి పోలీసుల సాయంతో ఆలయస్థలంలో ఆ వ్యక్తి నిర్మాణాలు చేపట్టాడు. దీనిని స్థానికులు, బీజేపీ నేతలు కలిసి అడ్డుకున్నారు.