తెరాస పాలనలో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?

Sunday, November 22nd, 2020, 10:00:14 PM IST

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెరాస రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. మౌలాలి డివిజన్ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే మౌలాలి వచ్చి చేసిన అభివృద్ది ను చూపించాలి అంటూ మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.

అయితే నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన బాలిక సుమేద హత్యకు బాధ్యత వహించాలి అని, ఆమె కుటుంబ సభ్యులకి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అయితే సామాన్యుల ఇళ్లకు వేలల్లో పన్నులు వేస్తుంటే, మౌలాలి తెరాస కార్పొరేటర్ కి 101 రూపాయలు మాత్రమే పన్ను వేశారు అని చెప్పుకొచ్చారు. ఇది న్యాయమా? ప్రజల్ని జలగల్లా పీడించింది తెరాస కార్పొరేటర్లు కాదా అని ప్రశ్నించారు.

అయితే తెరాస పాలన లో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ఏమిచ్చింది అంటున్న కేటీఆర్, హైదరాబాద్ కి ఏం చేశారు అంటూ నిలదీశారు. అంతేకాక దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, కేసీఆర్ లకు లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే GHMC ఎన్నికలను హిందూ, ముస్లిం ల ఎన్నికలు గా చిత్రకరించ వద్దు అని, తెరాస యాక్షన్ ను బట్టే, బీజేపీ రియాక్షన్ ఉంటుంది అని తెలిపారు.