డబుల్ బెడ్ రూం ఇళ్ళ హామీ ఏమైంది – కిషన్ రెడ్డి

Sunday, November 22nd, 2020, 02:08:58 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ నగరం లో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, తెరాస లు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కి హైదరాబాద్ తో విడదీయలేని అనుబంధం ఉంది అని తెలిపారు. GHMC ఎన్నికల్లో గెలవాలనే సంకల్పం తో పని చేస్తున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళ హామీ ఏమైంది అంటూ తెరాస ను సూటిగా ప్రశ్నించారు మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు తెరాస పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల ముందు ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు సనత్ నగర్ ఐడీ హెచ్ కాలనీలో ప్రారంభించారు అని గుర్తు చేశారు. అయితే వాటిని చూసి ప్రజలు భ్రమ పడ్డారు అని, ఇళ్లు ఇస్తారనే నమ్మకం తో ప్రజలు అంతా కూడా ఓటు వేశారు అని, పేద ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లు దండుకున్నారు అని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయిదేళ్ళు అయినా పేదలకు ఇళ్లు ఇవ్వలేక పోయారు అని విమర్శించారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చనీ తెరాస ను ప్రజలు ప్రశ్నించాలి అని అన్నారు. హైదరాబాద్ కి అనేక హామీలు ఇచ్చి విస్మరించారు అని, తెరాస కి ఎందుకు ఓటు వేయాలి అని ప్రజలు ప్రశ్నించాలి అని, నగరంలోకి సుమారు 6 లక్షల ఇళ్ళల్లోకి నీరు చేరింది అని, 40 మంది అమాయక ప్రజలు వరదల కారణంగా మృతి చెందారు అని అన్నారు. కనీస మౌలిక వసతులు సదుపాయాలు కూడా కల్పించ లేకపోయారు అని మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.