తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది

Sunday, November 22nd, 2020, 05:02:28 PM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తో బీజేపీ తన సత్తాను చాటేందుకు సిద్దం అయింది. దుబ్బాక ఉపఎన్నిక తో బీజేపీ నే తెరాస కి గట్టి పోటీ అని సంకేతాలు ఇచ్చింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, తెరాస తీరు ను ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తోంది. తెరాస పాలనలో ghmc స్థితిగతులు, గత ఎన్నికల్లో హామీల పై బీజేపీ ఒక ఛార్జ్ షీట్ విడుదల చేసింది. తెరాస వైఫల్యాలు అంటూ విడుదల చేసిన ఈ ఛార్జ్ షీట్ 60 వైఫల్యాలు అని తెలిపింది.

అయితే తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది అని, కేసీఆర్, అసదుద్దీన్ కుటుంబాలే పాలిస్తున్నాయి అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కేసీఆర్ కుటుంబం మరియు సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి అని, మొన్నటి వరదల వలన హైదరాబాద్ 15 రోజులు నీళ్ళలోనే ఉండిపోయింది అని అన్నారు. సరైన డ్రైనేజీ కూడా తెరాస ఏర్పాటు చేయలేక పోయింది అని, గ్లోబల్ సిటీ అని చెప్పారు, ఫ్లడ్ సిటీ గా మార్చారు అంటూ ద్వజమెత్తారు.

అయితే లక్ష ఉద్యోగాల హామీలు నీటి మూటలు అయ్యాయి అని, వరద సాయం సొమ్ములో సగం తెరాస నేతల జేబుల్లోకి వెళ్ళింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష రెండు పడకగడుల ఇళ్లు కడతామని అన్నారు, వెయ్యి కూడా కట్టలేదు అని ఆరోపించారు.మోడీ రెండున్నర కోట్ల రెండు పడక గదులు కట్టి చూపించారు అని, కరోనా సమయం లో ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మేయర్ గా ఎం ఐ ఎం అభ్యర్ధి కావాలా?బీజేపీ అభ్యర్థి కావాలా అంటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. అంతేకాక తెలంగాణ సాధన కోసం బీజేపీ పోరాడింది అని, పాలన కోసం కాదు అని మంత్రి వ్యాఖ్యానించారు.