బిగ్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల్లో ఆధిక్యం కనబరుస్తున్న బీజేపీ

Friday, December 4th, 2020, 09:57:43 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తం 150 సీట్ల కి గానూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో బీజేపీ 49 స్థానాల్లో ముందంజ లో ఉండగా, అధికార పార్టీ తెరాస 19 స్థానాల్లో దూసుకుపోతుంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే మజ్లిస్ పార్టీ ఎం ఐ ఎం ఎనిమిది స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.