నేడు ఛలో అంతర్వేది పిలుపునిచ్చిన బీజేపీ.. నేతలు ముందస్తు అరెస్ట్..!

Friday, September 18th, 2020, 07:30:59 AM IST

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు ‘ఛలో అంతర్వేది’కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. అయితే హిందూవాదులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బయలుదేరేందుకు సిద్ధమైన సోము వీర్రాజును పోలీసులు అడ్డుకుని విజయవాడలో ముందస్తు అరెస్ట్ చేశారు.

అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున సోము వీర్రాజును అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే గ్రామ వాలంటీర్ల ద్వారా బీజేపీ కార్యకర్తల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందని మండిపడ్డారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని సోము వీర్రాజు ప్రకటించారు. ఇక ఛలో అమలాపురం కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.