బిగ్ న్యూస్: గ్రేటర్ లో తెరాసను “ఢీ” కొట్టేందుకు బరిలోకి బీజేపీ అగ్ర నాయకులు!

Wednesday, November 25th, 2020, 10:38:15 PM IST


తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని ఇటు తెరాస, అటు బీజేపీ తలపడనున్నాయి. అయితే ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక లో బీజేపీ గెలవడం తో ఊపు మీద ఉన్న పార్టీ, ఈ గ్రేటర్ లో తన సత్తా చాటి తెలంగాణ లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే అధికార పార్టీ తెరాస సైతం మేనిఫెస్టో ను ప్రకటించి మరొకసారి గ్రేటర్ వాసులను ఆకర్షిస్తోంది.

అయితే ఈ ఎన్నికలో తెరాస పై విజయం సాధించేందుకు బీజేపీ అగ్ర నాయకుల తో ప్రచారం జరిగే అవకాశం ఉన్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నంద్ బరిలోకి దిగనున్నారు. అయితే ఒక జాతీయ పార్టీ అగ్ర నేతలు రాష్ట్రీయ తెరాస ను ఢీ కొట్టేందుకు దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.