జాంబాంగ్ డివిజన్ లో బీజేపీ ఆందోళన…ఎందుకంటే?

Friday, December 4th, 2020, 11:42:42 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే జాంబాంగ్ డివిజన్ లో బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. 471 ఓట్లు ఉండాలి అని, కానీ బాక్స్ లో 257 మాత్రమే ఉన్నాయి అంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పై అక్కడి అధికారులు స్పందించారు. పోలింగ్ శాతం తప్పుగా ప్రకటించామని వెల్లడించారు. అంతేకాక కన్ఫ్యూజన్ లో ఈ తప్పిదం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన సమాధానం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ను ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం మాత్రమే కాకుండా, అవసరం అయితే ఇక్కడ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎన్నిక పెట్టేలా చేసేందుకు బీజేపీ నేతలు చర్చ జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరి దీని పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.