అబద్దాలు చెప్పటంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడు – బీజేపీ నేత వివేక్

Friday, March 5th, 2021, 11:57:54 PM IST


తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికాలో చదువుకున్న అజ్ఞాని కేటీఆర్ అని అన్నారు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పటంలో కేటీఆర్ తన‌ తండ్రి కేసీఆర్‌ను మించిపోయాడని అన్నారు. ఐటీఐఆర్, ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు.

అయితే నివాసయోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ 4వ స్థా‌నం‌ నుంచి 24వ స్థానానికి పడిపోవడానికి కేటీఆర్ అసమర్ధతే కారణమని వివేక్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యాడని అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు భంగపాటు తప్పలేదని వివేక్ చెప్పుకొచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తండ్రీ కొడుకులకు ప్రజలు బుద్ధి చెబుతారని వివేక్ అన్నారు.