ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డికి కరోనా పాజిటివ్..!

Friday, September 25th, 2020, 08:20:33 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే తాజాగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డికి కరోనా సోకింది. జ్వరం, జలబు లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై బీజేపీ తలపెట్టిన కార్యక్రమాలలో విష్ణువర్ధన్‌రెడ్డి నిన్నటి వరకు యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో తనతోపాటు పాల్గొన్ననేతలు, తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.