నా రాజకీయ ప్రయాణం ప్రారంభమై నిన్నటితో 23 సంవత్సరాలు – విజయశాంతి

Wednesday, January 27th, 2021, 11:00:37 PM IST

బీజేపీ అధ్యక్షురాలు విజయశాంతి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి నిన్నటితో 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఉన్న ఫోటోను ఆమె పోస్ట్ చేస్తూ నాకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరికీ వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు. అంతేకాదు మీ ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

అయితే సినీనటిగా తన నటనతో మంచి పేరు తెచుకున్న విజయశాంతి తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ అనంతరం తన పార్టీనీ టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ తరపున ఆమె ఎంపీగా పనిచేశారు. అనంతరం కొన్ని విబేధాల కారణంగా టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా పనిచేశారు. ఇక ఇటీవల ఆమె తిరిగి బీజేపీ గూటికి చేరారు.