తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోంది.. బీజేపీ నేత సీరియస్ కామెంట్స్..!

Tuesday, April 13th, 2021, 05:44:03 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నేడు మీడియాతో మాట్లాడిన పొంగులేటి తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా.. కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. వరంగల్‌లో మంత్రి కేటీఆర్ విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాటాన్ని ఖండిస్తున్నట్టు పొంగులేటి చెప్పుకొచ్చాడు.

అయితే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడాడని ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం స్టీల్ ఫ్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమైందో కేటీఆర్ చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.