సాగర్ ఉపఎన్నికలో బీజేపీ నేత నివేదిత నామినేషన్ దాఖలు!

Friday, March 26th, 2021, 05:22:19 PM IST

తెలంగాణ రాష్ట్రం లో అనివార్యమైన నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో నామినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది. నేడు ఎనిమిది మంది అభ్యర్దులు నామినేషన్ వేశారు. నాగార్జున సాగర్ బరిలో గతం లో పోటీ చేసిన బీజేపీ ఇంచార్జీ కంకణాల నివేదిత రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే బీజేపీ అధిష్టానం ఇంకా అభ్యర్ధి ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే నివేదిత రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ పట్ల సర్వత్రా చర్చంశనీయం గా మారింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు అయింది. అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో ఎవరు గెలుస్తారు అనే దాని పై ఇప్పటి నుండి చర్చలు జరుగుతున్నాయి.