సీఎం కేసీఆర్‌కు కుటుంబం మీద ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థపై లేదు – మురళీధర్‌రావు

Tuesday, January 5th, 2021, 01:18:46 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యావ్యవస్థ అంధకారమైందని సీఎం కేసీఆర్‌కు కుటుంబం మీద ఉన్న శ్రద్ద విద్యా వ్యవస్థపై లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పి యువతను కేసీఆర్ మోసం చేశారని అన్నారు.

తన కుటుంబసభ్యులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ మంత్రి పదవీ లేకుండా ఉండలేరని అన్నారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమయ్యిందని మురళీధర్‌రావు అన్నారు. తెలంగాణలో యూనివర్సిటీలకు వీసీలను నియమించడం లేదని, తెలంగాణలో సరస్వతీ దేవి చీకట్లో మగ్గుతుందని అన్నారు. తెలంగాణలో విద్యా విధానం బాగుపడాలంటే అది బీజేపీతోనే సాధ్యమని అన్నారు.