తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి

Friday, December 18th, 2020, 07:22:48 AM IST

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేస్తున్న వారి పై మరొకసారి బీజేపీ నేత లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళారులకు కొమ్ముకాసే కొన్ని రాజకీయ శక్తులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలతో మేలు జరుగుతుంటే, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు చేపడితే కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేశాయి అని ఆరోపించారు.

నాటి ఆర్ధిక సంస్కరణల వలనే ప్రపంచం లో అభివృద్ది చెందిన దేశాల్లో భారత్ అయిడవ స్థానం లో ఉందని పేర్కొన్నారు. అయితే తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి అని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచిన విషయాన్ని లక్ష్మణ గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నిస్తే, ఓ యూ విద్యార్థి పై తెరాస నేతలు దాడికి పాల్పడ్డారు అని, దీన్ని బీజేపీ ఖండిస్తోంది అని లక్ష్మన్ తెలిపారు. తెరాస పాలనలో ఉద్యోగాల పరిస్తితి దారుణంగా తయారు అయింది అని, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకాలు ఆడుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.