తెరాస, మజ్లిస్ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయి – లక్ష్మణ్

Sunday, December 6th, 2020, 08:08:45 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరాస పాలనా విధానం పై, మజ్లిస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్నారు. అయితే అధికార తెరాస గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది అంటూ బీజేపీ జాతీయ ఓ బీసీ మొర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెరాస ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది పై దృష్టి సారించలేదు అని అన్నారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ లో వరద, బురద పేరుకుపోయే పరిస్థతి వచ్చింది అని ఘాటు విమర్శలు చేశారు.

అయితే ఉద్యోగ కల్పన లో వెనుకబడిన ప్రభుత్వం, నిరుద్యోగ భృతి అందించలేదు అని తెలిపారు. అంతేకాక తెరాస, మజ్లిస్ పార్టీలు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయం లో ప్రభుత్వం ప్రజలను ఆదుకొలేదు అని, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాసి పేదలను దోచుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులకు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అంటే తెరాస అడ్డుపడింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే దుబ్బాక ఉపఎన్నిక తో బీజేపీ విజయం సాధించి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూసుకుపోతుంది అనే ఉద్దేశ్యం తో ఎన్నికలను ముందుకు తీసుకు వచ్చారు అని తెలిపారు. అంతేకాక వరద సాయం పంపిణీ లో భారీగా దోపిడీ జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.