దోచుకోడానికి అవకాశం లేకుండా పోతోందని దుష్ప్రచారం – లక్ష్మణ్

Sunday, November 1st, 2020, 10:00:14 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ కీలక నేత, ఓ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తూ అన్ని విధాలా సహకరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే దోచుకోడానికి అవకాశం లేకుండా పోతోందని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆరోపించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటా కింద 70 వేల కోట్ల రూపాయలు కేటాయించింది అని లక్ష్మణ్ తెలిపారు. అయితే కేంద్ర సర్కార్ నుండి పంచాయతీ లు, మున్సిపాలిటీ లకు నిధులు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కనీస అవగాహన లేకుండా, నిరాశ, నిస్పృహ తో కేంద్రం పై విమర్శలు చేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల పై కేసీఆర్ వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనే సంకల్పం తో వచ్చిన వ్యవసాయ బిల్లు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పై ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయడం పట్ల లక్ష్మణ్ కేసీఆర్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.