కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి గా అన్ని శాఖలను శాసిస్తున్నారు – కిషన్ రెడ్డి

Sunday, March 14th, 2021, 06:02:40 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి కేంద్రం పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేంద్రం ను విమర్శించడం తెరాస నాయకులకు అలవాటైంది అంటూ సెటైర్స్ వేశారు. అయితే ఏ ప్రతిపాదికన రాష్ట్రం లోని అన్ని శాఖల పై కేటీఆర్ పెత్తనం చెలాయస్తున్నారో చెప్పాలి అంటూ నిలదీశారు. అయితే భైంసా, ఫిర్యాదుల పై నివేదిక అందించాలి అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రభుత్వాన్ని కొరబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి గా అన్ని శాఖలను శాసిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాక తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదేపదే అబద్ధాలు ప్రచారం చేసింది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోడీ అమ్మేసారు అని వ్యాఖ్యానించారు అంటూ విమర్శించారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం పై కేంద్రం విధాన నిర్ణయం తీసుకుందని, నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమ ను నడపటం భారం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక విశాఖ ఉక్కు ఏపీ ప్రభుత్వం తీసుకుంటా అంటే కేంద్రం ఆలోచిస్తుంది అని, విశాఖ ఉక్కు కన్నా ముందు కేటీఆర్ రాష్ట్ర సమస్యలు పట్టించుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.