రెండున్నరేళ్ల తర్వాత జగన్ కూడా మారిపోవచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!

Thursday, December 10th, 2020, 12:00:28 AM IST

ఏపీ సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జగన్‌ను పోలుస్తూ ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు. జగన్‌కు ప్రజల కష్టాలు తెలియడం లేదని, ఎంతసేపు కక్ష్యపూరితంగానే పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని, రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని వ్యాఖ్యానించారు.

అయితే ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే..ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ తప్పుకోవాలని అన్నారు. జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని, వైఎస్ భారతి సీఎం అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.