విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో వారం లోగా చెప్పాలి

Thursday, January 21st, 2021, 04:40:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరు పై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అండ దండలతో నే విగ్రహాల ధ్వంసం జరుగుతోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే డీజీపీ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసేందుకు ఆందోళన కి పిలుపు ఇచ్చారు. అయితే కన్నా లక్ష్మీ నారాయణ ను ఇంట్లో నుండి బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు అడ్డుకున్నారు, నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ప్రజాస్వామ్యం అనేది లేదు అని అన్నారు.అయితే ఏడాదిన్నర కాలం గా హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతూనే ఉన్న, కారణం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. అయితే ఇటువంటి ప్రభుత్వము ను తన 40 ఏళ్ల రాజకీయ జీవితం లో చూడలేదు అని, ఎంతో ఆదర్శనీయం గా ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవడం వలన ఈ పరిస్తితి నెలకొంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే సంక్షేమ పథకాలు, డబ్బులు పంచి మళ్ళీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారు, ఇవేమీ వారి సొంత డబ్బులు కావని అన్నారు. అయితే విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో వారం లోగా ప్రభుత్వం చెప్పాలి అంటూ కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.