ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోంది – జేపీ నడ్డా

Sunday, October 18th, 2020, 01:47:20 AM IST


కాంగ్రెస్ పార్టీ తీరు పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జమ్ము కాశ్మీర్ ఎల్ ఆర్టికల్ 370 ను తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను జేపీ నద్దా ఖండించారు. బీహార్ లో ఎన్నికల నుండి కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ ను ప్లే చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జమ్ము కాశ్మీర్ లో ప్రజల ప్రాణాలను కాపాడుకొనేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు.

అయితే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఎటువంటి అజెండా లేకపోవడం కారణం చేత ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తోంది అని విమర్శించారు. అయితే గత ఏడాది ఆగస్టు 5 న, జమ్ము కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక హోదా ను కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల చిదంబరం ఘాటుగా చేసిన విమర్శలకు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ పాకిస్తాన్ ను ప్రశంసించడం, అదే పార్టీ కి చెందిన మరొక కీలక నేత చిదంబరం కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను అమలు చేయాలని కోరడం సిగ్గు చేటు అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు.