ఓడిపోతామని తెలిసే మంత్రి హరీశ్‌ను బలిపశువును చేశారు – జితేందర్ రెడ్డి

Friday, November 13th, 2020, 03:10:53 PM IST

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని తెలిసే మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ బలిపశువును చేశారని అన్నారు. బీజేపీలోకి టీఆర్ఎస్ సహా పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లలో గెలవబోతోందని అన్నారు.

గ్రేతర్ ఎన్నికలలో బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నియంత పాలన తిప్పికొట్టాలన్న కసి ప్రజల్లో ఏర్పడిందని, అది దుబ్బాక ఎన్నికలలో స్పష్టంగా కనబడిందని అన్నారు. ఒక్క దుబ్బాకలోనే 84వేల మంది ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకత చూపించారంటే ప్రజలు ఎంతలా మార్పు కోరుకుంటున్నారో అర్ధమైపోతుందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పుకొచ్చారు.