బిగ్ న్యూస్: జయా బచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు – జయ ప్రద

Wednesday, September 16th, 2020, 11:09:12 PM IST


బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం లో బయటపడ్డ డ్రగ్స్ కోణం తో దేశవ్యాప్తంగా పలు చర్చలు మొదలు అయ్యాయి. పార్లమెంట్ లో సైతం పలు విమర్శలకు దారితీసింది. అయితే ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలకు జయా బచ్చన్ స్పందించడం పట్ల నటి, బీజేపీ నాయకురాలు జయ ప్రద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. రవి కిషన్ చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని జయా బచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలను పలువురు సమర్ధిస్తూ వస్తున్నారు. అయితే కంగనా రనౌత్ తో సహా పలువురు ప్రముఖులు జయా బచ్చన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే డ్రగ్స్ కి బానిసలు అయిన యువత ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రవి కిషన్ కి మద్దతు ఇస్తున్నా అని జయ ప్రద అన్నారు. మనమంతా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలి అని, యువతను కాపాడాలి అని కోరారు. జయా బచ్చన్ ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.