సీఎం జగన్ చేతకానితనంతో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారు – బీజేపీ నేత

Sunday, May 16th, 2021, 10:20:24 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం పై ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరొకసారి బీజేపీ నేత, మాజి ఎమ్మెల్యే విష్ణు కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పాలన లో అన్నీ అస్తవ్యస్తం గా ఉన్నాయి అని విమర్శించారు. రాష్ట్రం లోని ప్రతి ఇంటి లో ప్రజలు అవస్థలు పడుతున్నారు అని అవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేతకానితనంతో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన సీఎం పదవికి రాజీనామా చేసి, సతీమణి వైఎస్ భారతి కి బాధ్యతలు అప్పగిస్తే అప్పుడైనా రాష్ట్రం లో కొంత మార్పు వస్తుందేమో చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు. కనీసం ఇప్పటికైనా సీఎం జగన్ ప్రజల ఆర్త నాదాలు అర్దం చేసుకోవాలి అంటూ సూచించారు. అయితే సీఎం జగన్ పాలనా విధానం పై మరొకపక్క టీడీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.