మంత్రి హరీశ్‌రావుకు బీజేపీ నేత బాబుమోహన్ సూటి ప్రశ్న..!

Saturday, October 24th, 2020, 03:00:19 AM IST

దుబ్బాక ఉప ఎన్నిక వేడి మరింత పెరిగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేత బాబు మోహన్ మంత్రి హరీశ్‌రావుకు సూటి ప్రశ్న వేశారు. దుబ్బాక అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోయిందని అన్నారు. మంత్రి హరీష్ రావు తనకు సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక ఒక కన్ను అని చెబుతున్నారని అదే నిజమైతే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు.

ఇక మొన్నటిదాకా టీఆర్ఎస్‌లో ఉండి, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అభివృద్ధి చేస్తానంటూ తిరుగుతున్న అభ్యర్థి మళ్ళీ ఎన్నికలు అయిపోగానే టీఆర్ఎస్‌లో చేరిపోతారంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రశ్నించే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గొంతుకు, దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇంకొక గొంతును కూడా కలపాలని అన్నారు.