దుబ్బాక ఉపఎన్నిక తో కేసీఆర్ కి, హరీశ్ రావు కి ముచ్చెమటలు పడుతున్నాయి

Tuesday, October 27th, 2020, 02:20:53 PM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక కీలక కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు అని, ఓటమి భయం పట్టుకుంది అంటూ ప్రతి పక్ష పార్టీ నేతలు అంటున్నారు. బీజే నేతలు సైతం తెరాస పార్టీ తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుబ్బాక సీపీ ను సస్పెండ్ చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీజేపీ నేతలు బండి సంజయ్ ను కలిసి మాట్లాడారు. డీకే అరుణ మరియు మాజీ మంత్రి బాబు మోహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెరాస కి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావు అని ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటూ డీ కే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెరాస కి ఓటమి భయం, అధికార దాహంతో బీజేపీ నేతల పై దాడులకు తెగబడుతున్నారు అని అన్నారు. బాబు మోహన్ సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక తో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరియు హరీశ్ రావు లకు ముచ్చెమటలు పడుతున్నాయి అని విమర్శించారు. బీజేపీ గెలుస్తుందని భయంతో అలజడులు సృష్టిస్తున్నారు అని అన్నారు. మామ అల్లుళ్ళ మెప్పు కోసం సీపీ ఏదైనా చేస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సచ్చిపోయే వరకు అధికారంలో ఉంటామనే మామ అల్లుళ్ళు కలలు నిజం కావు అని, కార్యకర్తలు మనో ధైర్యంతో ఉండాలి అని అన్నారు.