తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

Friday, January 15th, 2021, 02:42:35 PM IST

తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ అధికారం లోకి వస్తుంది అంటూ బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ అన్నారు. అయితే అనంతగిరి లో పద్మనాభ స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో బీజేపీ ది కీలక పాత్ర అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించింది బీజేపీ నే అంటూ వ్యాఖ్యానించారు.

అయితే బీజేపీ కార్యకర్తలు నిబద్దత తో పని చేస్తారు అని, చనిపోయిన తర్వాత కూడా పార్టీ జెండా కప్పాలి అనేది ప్రతి కార్యకర్త కోరిక అంటూ వ్యాఖ్యానించారు. అందుకే తాను మళ్ళీ పార్టీ సభ్యత్వం తీసుకున్నాను అని అన్నారు. బీజేపీ కి రెండు సీట్లు ఉండటం శుభ పరిణామం అని, రెండు సీట్ల తోనే దేశంలో అధికారం లోకి వచ్చాం అని, తెలంగాణలో తమ పార్టీ కి రెండు స్థానాలు ఉన్నాయి అని, రానున్న రోజుల్లో తెలంగాణ లో అధికారం లోకి వస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే విద్యా సాగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.