దుబ్బాక లో బీజేపీ గెలవడం కేసీఆర్ ను ఓడించినట్టే – బాబు మోహన్

Monday, November 23rd, 2020, 11:51:01 AM IST

అనివార్యం అయిన దుబ్బాక ఉపఎన్నిక లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయ ఢంకా మోగించారు. అయితే ఈ కీలక విజయం స్ఫూర్తి తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ కి చెందిన నేత బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక దుబ్బాక లో బీజేపీ గెలవడం కేసీఆర్ ను ఓడించినట్టే అని అన్నారు. నేడు ఉదయం తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్న బాబు మోహన్ మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ లోకి నాయకుల చేరికలు పెరిగాయి అని అన్నారు. అయితే తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస పై ఘన విజయం సాధించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తుంది. బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ అవ్వడంతో తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.