దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు.. బీజేపీ నేత రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు..!

Tuesday, August 11th, 2020, 04:20:38 PM IST

ఏపీలో మూడు రాజధానుల నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ముఖ్యనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవని అన్నారు.

అంతేకాదు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఒక్కటే రాజధాని ఉందని గుర్తు చేశారు. అయితే మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం జోక్యం చేసుకోదని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణంలో అవినీతిని బీజేపీ ప్రశ్నించిందని, మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వ అవినీతి చేస్తే కూడా బీజేపీ తప్పకుండా ప్రశ్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయబోతుందని అన్నారు.