తప్పుడు అఫిడవిట్.. ‌బీజేపీ కార్పోరేటర్‌పై కేసు నమోదు..!

Wednesday, January 27th, 2021, 10:00:12 PM IST

హైదరాబాద్ నగరంలోని జాంబాగ్ బీజేపీ కార్పోరేటర్‌ రాకేష్‌ జైస్వాల్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. ముగ్గురు సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అయినపట్టికి రాకేష్‌ జైస్వాల్‌కు తనకు ముగ్గురు సంతానం ఉన్నా, ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారని ఎన్నికల సమయంలో అధికారులకు తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని ఎంఐఎం అభ్యర్థి జడల రవీందర్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాకేష్‌ జైస్వాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో కార్పోరేటర్ రాకేష్‌ జైస్వాల్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.