తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతుంది.. తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, February 24th, 2021, 02:17:00 AM IST


టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, త్వరలోనే రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిపిస్తామని తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతామని, అవినీతి పరులకు శిక్ష పడేదాకా వదలిపెట్టబోమని తరుణ్ చుగ్ హెచ్చరించారు.

సింగరేణి సంస్థను కూడా అవినీతిమయం చేశారని, యూనియన్‌ లీడర్‌గా సింగరేణి కాలరీస్‌ని కవిత తన గుప్పెట్లో పెట్టుకున్నారని, కవిత ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని తరుణ్ చుగ్ సూచించారు. టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతో నేరస్తులను పోలీసులు కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. బీజేపీ ఒక తుఫాన్ అని, బీజేపీ తుఫాన్‌లో మీరంతా కొట్టుకుపోతారని టీఆర్ఎస్ నేతలకు చుగ్ వార్నింగ్ ఇచ్చారు.