బిగ్ న్యూస్: దుబ్బాక ఉపఎన్నిక లో బీజేపీ ఆధిక్యం

Tuesday, November 10th, 2020, 10:23:06 AM IST

దుబ్బాక ఉపఎన్నిక కి సంబంధించి కి కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కౌంటింగ్ లో బీజేపీ ఆధిక్యం కొనసాగీస్తోంది. అయితే ఇప్పటి వరకు మొదటి రెండు రౌండ్లు కలిపి 14,573 ఓట్లను లెక్కించగా, అందులో బీజేపీ 6,492, తెరాస 5,357 మరియు కాంగ్రెస్ 1,315 ఓట్లు సాధించాయి. అయితే రౌండ్లు మిగిలి ఉండటంతో ఎవరూ గెలుస్తార నే దాని పై ఉత్కంఠ నెలకొంది. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.

దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీ తెరాస కి మరియు బీజేపీ మద్యలో ప్రచార సమయం లో మాటల యుద్దాలు నడిచాయి. అయితే నేడు దుబ్బాక భవితవ్యం తెలనుండటం తో ఇరు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.