ఏపీకి కొత్త గవర్నర్.. బిశ్వభూషణ్ హరిచందన్‌ని తప్పించనున్నారా?

Thursday, August 13th, 2020, 07:09:10 AM IST

ఏపీకి త్వరలో కొత్త గవర్నర్ రాబోతున్నారని, ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని తప్పించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఏపీలో అధ్యక్ష మార్పును కూడా చేపట్టింది.

అయితే తాజాగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని కూడా కేంద్రం మార్చేందుకు రంగం సిద్దం చేసిందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్రాన్ని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అదే కేంద్రానికి తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. నిమ్మగడ్డ ప్రసాద్ నియామకం అంశం, మూడు రాజధానుల బిల్లుల ఆమోదం వంటి అంశాలపై గవర్నర్ బిశ్వభూషణ్ వ్యవహరించిన తీరు కేంద్రాన్ని ఇరుకున పెట్టిందని అందుకే ఆయనను తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టు అలికిడి వినిపిస్తుంది.

అయితే ఆయన స్థానంలో ప్రస్తుతం పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీనీ నియమించాలని, ఆమె అయితే సీఎం జగన్ దూకుడుకు కూడా కళ్ళెం వేయవచ్చు అని బీజేపీ భావిస్తుందట. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.