తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్.. నేడు ముఖ్య నేతల సమావేశం..!

Saturday, December 12th, 2020, 09:21:10 AM IST

ఏపీలో తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇటీవల కరోనా బారిన పడి తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మృతిచెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే ఇప్పటికే ఈ స్థానంలో పోటీ చేసేందుకు టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

తెలంగాణలోని దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాలు సాధించిన తరహాలోనే తిరుపతిలోనూ గెలుపొంది రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. అయితే జనసేనతో బీజేపీ కేవలం మద్ధతు మాత్రమే తీసుకుంటుందా లేక జనసేనకు ఈ సీటు అప్పచెబుతుందా అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే నేడు తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ ముఖ్యనేతలు అందరూ ఈ సమావేశానికి హాజరై తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది.