సీఎం జగన్‌కు లేఖ రాసిన ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు.. ఎందుకంటే?

Friday, November 27th, 2020, 02:04:35 AM IST

ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోమువీర్రాజు లేఖ రాశారు. నిరుపేద, చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి ఆర్థిక అవసరాలు తీర్చడానికి జగన్ ప్రభుత్వం “జగనన్న తోడు” కానుక పేరుతో దాదాపు 10 లక్షల మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంకుల ద్వారా సుమారు 1000 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టింది.

అయితే ఈ పథకంపై స్పందించిన సోమువీర్రాజు కేంద్ర పథకాన్ని జగనన్న తోడు పథకంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో చేతివృత్తులవారు ఉపాధి కోల్పోయారుని, కనీసం ప్రధాని ఫోటో కూడా పెట్టకుండా ఈ పథకాన్ని తమ పథకమని ఎలా ప్రచారం‌ చేసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే జగనన్న తోడు పథకం పేరును ఉపసంహరించుకోవాలని, కేంద్ర పథకాలను ఉపయోగించినప్పుడు ప్రధాని మోదీ చిత్రాలను ఉంచాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.