ఇద్దరు సీఎంలు ఏకమై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు – బండి సంజయ్

Wednesday, August 26th, 2020, 09:30:02 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు ఏకమై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. శ్రీశైలం పవర్‌హౌజ్‌ ప్రమాదంలో ప్రమాదంలో మృతి చెందిన జెన్‌కో డీఈ బత్తిని శ్రీనివాస్ గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ మాట్లాడుతూ వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఉద్యోగులు ఆత్మ బలిదానాలు చేశారని అన్నారు.

అయితే దీనికి గుర్తుగా ముఖ్యమంత్రి భిక్ష వేసినట్లు 50 లక్షలు, 25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పి ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు.