వేలు చూపిస్తే చేయి కోస్తాం జాగ్రత్త.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, September 8th, 2020, 02:50:16 PM IST

తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్ అల్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు.

అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో బీజేపీ మద్దతుదారులు, హిందువులు ఇబ్బంది పడుతున్నారని వారిని బీజేపీ తప్పక కాపాడుకుంటుందని అన్నారు. ఎవరైనా వారిపై వేలెత్తి చూపిస్తే వారి చేయి కోస్తాం జాగ్రత్త అంటూ ఘాటుగా హెచ్చరించారు. అయితే ప్రజలకు బీజేపీ ద్వారానే న్యాయం చేకూరుతుందని అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించాలని భావిస్తుందని అయితే ఎవరూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.