దుబ్బాక ఉపఎన్నిక లో బీజేపీ తరపున పోటీ చేయనున్న వ్యక్తి ఇతనే!

Wednesday, October 7th, 2020, 03:00:16 AM IST

తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే కాకుండా దేశంలో పలు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. మొత్తం దేశ వ్యాప్తంగా 17 స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధులను ప్రకటించడం జరిగింది. అయితే దుబ్బాక నియోజక వర్గం ఉపఎన్నిక కి సైతం ఈ పార్టీ తమ అభ్యర్థి ను ఖరారు చేయడం జరిగింది. బీజేపీ కి చెందిన సీనియర్ నేత ఎం. రఘునందన్ రావు పేరు ను పార్టీ ఖరారు చేసింది.

అయితే ఈ ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి గా ఇప్పటికే సోలిపేట సుజాత ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇంకా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ను ప్రకటించాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ప్రతి ఒక్క పార్టీ సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.