బీజేపీ, జనసేన పార్టీ లు సంయుక్తంగా నిరసన కార్యక్రమం…ఎందుకంటే!?

Thursday, September 10th, 2020, 02:06:09 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై బీజేపీ మరియు జన సేన పార్టీ లు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను నిలదీసేందుకు సిద్దం అవుతున్నాయి. హిందూ దేవాలయాల పై వరుస దాడులు జరుగుతున్న నేపధ్యంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ పరిరక్షణ చేయకపోవడం వలన బీజేపీ మరియు జన సేన పార్టీ లు రెండు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు సోము వీర్రాజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ ఉదయం పది గంటల నుండి 11 గంటల వరకు చేయనున్నట్లు తెలిపారు.

అయితే ప్రతి హిందువు కూడా తమ ఇంటి వద్దనే ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జన సేన పార్టీ సైతం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రథం దగ్ధం పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఘటన కి కారకులు అయిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఇది ముమ్మాటికీ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్షం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేయడం జరిగింది.