వచ్చే 4-6 నెలల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రం – బిల్ గేట్స్

Monday, December 14th, 2020, 12:48:06 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను భయ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూ నే ఉంది అని, అంతేకాక దీని తీవ్రత రాబోయే 4 నుండి 6 నెలల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ అన్నారు.

ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారకరమైన విషయం ఏమిటి అంటే, రానున్న 4 నుండి 6 నెలల్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని బిల్ గేట్స్ అన్నారు. ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూఏషన్ అంచనాల మేరకు మరో రెండు లక్షల మరణాలు దేశం లో సంభవించే అవకాశం ఉందని అన్నారు. అయితే మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తే మరణాల శాతాన్ని తగ్గించవచ్చు అని అన్నారు. 2015 లోనే ఇలాంటి మహమ్మారి గురించి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ ల పై తను అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండటం సంతోషకరం అని తెలిపారు.