సీఎం జగన్‌కి ఫోన్ చేసిన బీహార్ సీఎం.. ఎందుకంటే?

Friday, September 11th, 2020, 10:26:04 AM IST

ఏపీ సీఎం జగన్‌కి బీహర్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక గురుంచి మాట్లాడారు. ఈ నెల 14 వ తేది నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగుతున్నాయని అయితే తొలిరోజు సమావేశంలో డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగుతుందని అన్నారు. అయితే ఈ ఎన్నికలలో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి పోటీ చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ అభ్యర్థికి మద్ధతు తెలపాల్సిందిగా నితీష్ కుమార్ జగన్‌ను కోరారు.

అయితే 2018లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఏడాదితో హరివంశ్ పదవికాలం ముగియనుండడంతో మరోసారి ఆయనే పోటీలో నిలిచారు. ఇక వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉంది. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సంగతి తెలిసిందే.