దుబ్బాక ఉప ఎన్నిక బరిలో బిగ్‌బాస్ ఫేమ్..!

Thursday, September 10th, 2020, 07:27:55 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఈ ఉప ఎన్నిక బరిలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక రెడీ అయ్యింది. ఇప్పటికే ఈమె దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు.

అయితే సిద్దిపేట జిల్లా బీసీ (గౌడ) సామాజికవర్గానికి చెందిన చెందిన కత్తి కార్తీక దుబ్బాక నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని అంటున్నారు. గత ప్రభుత్వాలు దుబ్బాక నియోజకవర్గంలో తమ సామాజికవర్గానికి ఎలాంటి న్యాయం చేయలేదని ప్రజలకు చెబుతున్నారు. అంతేకాదు పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందాయని మరి దుబ్బాక నియోజకవర్గం ఎందుకు అంతలా అభివృద్ధి చేయలేదని అంటున్నారు. తన సామాజికవర్గానికే కాదు, ఏ ఒక్కరికి సమస్య ఉన్నా తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆమె అంటున్నారు.