న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో ఈటల ప్రమేయం..!

Saturday, May 8th, 2021, 09:05:52 PM IST

హైకోర్ట్ న్యాయమూర్తి వామనరావు దంపతుల హత్య కేసు మరో మలుపు తీసుకుంది. తాజాగా భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ పేరు ఈ కేసులో తెరపైకి వచ్చింది. వామనరావు తండ్రి కిషన్‌రావు నేడు మీడియా ముందు మాట్లాడుతూ తన కొడుకు, కోడలు హత్య కేసులో ఈటల రాజేందర్ ప్రమేయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య గురుంచి ఈటల రాజేందర్‌కు ముందే తెలుసని అన్నారు. ఈ హత్య కేసులో ఈటల ప్రమేయంపై లోతైన విచారణ చేపట్టాలని వామనరావు తండ్రి కిషన్‌రావు డిమాండ్ చేశారు. పుట్ట మధు భార్య శైలజకు కూడా ఈ హత్య కేసుతో సంబంధం ఉందని, దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు అతని అనుచరులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మంథని కోర్టు ఆదేశాల మేరకు పుట్ట మధు భార్య పుట్ట శైలజపై కూడా కేసు నమోదైంది. అయితే గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిన పుట్ట మధును నేడు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకుని ఈ కేసుపై విచారిస్తున్నారు.