నన్ను 139 మంది రేప్ చేయలేదు.. అసలు నిజాన్ని బయటపెట్టిన యువతి..!

Monday, August 31st, 2020, 03:35:19 PM IST

asha

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన 139 మంది రేప్ చేసిన కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల ఓ యువతి తనను 139 మంది రేప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనను రేప్ చేసిన వారిలో అనేక మంది ప్రముఖులు, సెలబ్రెటీలు ఉన్నారని తెలపగా యాంకర్ ప్రదీప్, టాలీవుడ్ నటుడు కృష్ణుడి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.

అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆ యువతి మాట మార్చింది. తనను అసలు ఎవరూ రేప్ చెయ్యలేదనీ, తనతో డాలర్ బాయ్ అనే వ్యక్తి ఇలా చెప్పించాడని, సెలబ్రెటీలను, ప్రముఖులను ఈ ఉచ్చులోకి లాగి భారీగా మనీ వసూలు చేయడానికి డాలర్ బాయ్ స్కెచ్ వేశాడని చెప్పింది. తన ఫ్యామిలీ మొత్తాన్నీ చంపేస్తానని డాలర్ బాయ్ బెదిరించాడని, తనను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్లో మాట్లాడించి ఆ క్లిప్పింగులనే సాక్ష్యాలుగా పోలీసులకు చూపించమన్నాడని తెలిపింది. తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా డాలర్ బాయ్ ఇలాగే ట్రాప్ చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు డాలర్ బాయ్ ని పట్టుకునే పనిలో ఉన్నట్టు సమాచారం.